No Time To Die: పోరాటాల కోసం.. రూ.50 లక్షల కూల్‌ డ్రింక్‌

ఈ కూల్‌డ్రింక్‌ తాగండి అదిరిపోద్ది....ఆ కూల్‌ డ్రింక్‌ తాగండి దుమ్మురేగిపోద్ది అంటూ కూల్‌డ్రింక్స్‌ యాడ్స్‌ చేస్తుంటారు మన సినీతారలు. ఆ యాడ్స్‌ ప్రచారానికి కోట్లాది రూపాయలు..

Updated : 10 Sep 2021 10:31 IST

ఈ కూల్‌డ్రింక్‌ తాగండి అదిరిపోద్ది....ఆ కూల్‌ డ్రింక్‌ తాగండి దుమ్మురేగిపోద్ది అంటూ కూల్‌డ్రింక్స్‌ యాడ్స్‌ చేస్తుంటారు మన సినీతారలు. ఆ యాడ్స్‌ ప్రచారానికి కోట్లాది రూపాయలు పారితోషికంగా తీసుకుంటారు. సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు చేసి చేసి అలసిపోయి హాయిగా ఓ కూల్‌డ్రింక్‌ తాగేస్తారు మన తారలు. కానీ ఇక్కడ ఓ స్టార్‌ హీరో కోసం వేల లీటర్ల కూల్‌డ్రింక్‌ను నేలపాలు చేశారు. జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో వస్తున్న తాజా చిత్రం ‘నో టైమ్‌ టు డై’. డేనియల్‌ క్రేగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌లోని యాక్షన్‌ ఘట్టాల ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పోరాట సన్నివేశాల కోసం సుమారు 32 వేల లీటర్ల కూల్‌డ్రింక్‌ను వెదజల్లారట. దీని కోసం రూ.50 లక్షలుపైనే ఖర్చుపెట్టారు. ఇంతకీ కూల్‌డ్రింక్‌ ఎందుకు వాడారు? అనే విషయం గురించి ఈ చిత్రం కోసం పనిచేసిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ లీ మారిసన్‌ మాట్లాడుతూ ‘‘ఇటలీ వీధుల్లో చేసే మోటర్‌బైక్‌ స్టంట్స్‌ కోసం ఇదంతా చేశాం. స్టంట్స్‌ చేసిన ఇటలీ వీధుల్లో బండి జారకుండా ఉండేందుకు కూల్‌డ్రింక్‌ను పోశాం. అది కొద్ది సేపటికి ఆరిపోతుంది. అప్పుడు ఆ ప్రాంతమంతా జారుడు స్వభావం బాగా తగ్గిపోతుంది. దీంతో బైక్‌ విన్యాసాలు చేయడం సులువు అవుతుంది’’అని చెప్పారు. చిన్న చిత్రాలకు రూ.50 లక్షలు అంటే పెద్ద మొత్తం కావొచ్చేమో కానీ రూ.వందల కోట్లు పెట్టే చిత్రాలకు ఇది చిన్న మొత్తమే అంటున్నాయి హాలీవుడ్‌ వర్గాలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు