Published : 27/11/2021 01:16 IST

Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్‌ను గేమ్‌గా ఆడండి

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌(Bigg boss telugu 5)లో హౌస్‌మేట్స్‌ ఎమోషనల్ జర్నీ కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌కు వచ్చి అందరితోనూ కలిసి సందడి చేస్తున్నారు. శుక్రవారం సన్నీ తల్లి కళావతి వచ్చి మాట్లాడారు. పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ‘నాగార్జునగారు నన్ను తిట్టారు చూశావా’ అని సన్నీ అడగ్గా, ‘కోపమైనా, ప్రేమ అయిన ఇష్టమైన వారిపైనే ఉంటుంది. నాగార్జున గారు చాలా మంచి వారు’ అంటూ సన్నీని అతడి తల్లి సముదాయించింది. బయటకు వచ్చిన తర్వాత కలవాలని ఉందని చెప్పగా, ‘షూటింగ్‌ లేని సమయంలో అనుమతి తీసుకుని కలుద్దాం’ అని సన్నీ తన తల్లితో చెప్పాడు. మరోవైపు ప్రియాంక వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని మానస్‌-కాజల్‌ మాట్లాడుకున్నారు. సన్నీ దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉండటంతో అతడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని మానస్‌ అన్నాడు.

ఆ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు

గురువారం హౌస్‌లోకి వచ్చిన సిరి తల్లి ‘షణ్ముఖ్‌-సిరి హగ్‌ చేసుకోవటం నాకు నచ్చలేదు’అని అన్నదానిపై షణ్ముఖ్‌ తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. గార్డెన్‌ ఏరియాలో సిరి కూర్చొని ఉండగా ‘ఉన్న కొద్దిరోజులైనా కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఇంట్లో వాళ్లను బాధపెట్టొద్దు. నేను మాత్రం  తండ్రిలేని కూతురు అని చెప్పి అడ్వాంటేజ్‌ తీసుకోలేదు. ఈ విషయం దయచేసి నువ్వైనా మీ అమ్మకు చెప్పు’ అని సిరికి షణ్ముఖ్‌ చెప్పాడు. దీంతో సిరి తలదించుకుని బాధపడింది. ప్రియాంకతో మాట్లాడటానికి ఆమె బంధువు మధు వచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. సన్నీకి తాను ఫ్యాన్‌ అని మధు చెప్పింది. వెళ్తూ మానస్‌కు సారీ చెప్పింది.

హౌస్‌లో రవి కూతురు సందడి

రవి సతీమణి, కూతురు దియాలు ఇంటి లోపలికి వచ్చారు. దీంతో రవి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ‘నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుంది’ అని దియా చెప్పడంతో రవి ఓదార్చాడు. రవి ఎవరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయలేడని అతడి భార్య ఇంటి సభ్యులతో చెప్పింది. అనంతరం ఇంటి సభ్యులందరూ కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొన్నారు. దియాతో కలిసి రవి గార్డెన్‌ ఏరియాలో కాసేపు ఆటలాడాడు. ‘డాడీ’లో పాటకు చిందేశారు.

గేమ్‌ను గేమ్‌లా ఆడు..: షణ్ముఖ్‌ తల్లి

అందరితోనూ కలిసి ఆడమంటూ షణ్ముఖ్‌కు అతడి తల్లి సలహా ఇచ్చింది. ‘దీపు ఎలా ఉంది’ అని అడగ్గా ‘చాలా బాగుంది. అమ్మ అబద్ధం చెప్పదు’ అని అన్నది. షణ్ముఖ్‌కు బ్రహ్మ అని పేరు రావటం సంతోషంగా ఉందన్నారు. సిరి తల్లి వచ్చి ఏమన్నారో నువ్వు చూశావా? అని షణ్ముఖ్‌ తన తల్లిని అడగ్గా, ‘అర్థం చేసుకోగలను’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అంతలోనే సిరి వచ్చి పలకరించగా ‘గేమ్‌ను గేమ్‌లా ఆడండి. ఎమోషనల్‌గా మారిపోవద్దు’ అని ఇద్దరికీ సలహా ఇచ్చారు. తమ గేమ్‌ మార్చుకుంటామని, రేపటి నుంచి అందరూ కొత్త ఆటను చూస్తారని ఇద్దరూ చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని