Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్‌ను గేమ్‌గా ఆడండి
బిగ్‌బాస్(Bigg boss telugu 5)లో హౌస్‌మేట్స్ ఎమోషనల్ జర్నీ కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల
హైదరాబాద్: బిగ్‌బాస్(Bigg boss telugu 5)లో హౌస్‌మేట్స్ ఎమోషనల్ జర్నీ కొనసాగుతోంది. కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌కు వచ్చి అందరితోనూ కలిసి సందడి చేస్తున్నారు. శుక్రవారం సన్నీ తల్లి కళావతి వచ్చి మాట్లాడారు. పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ‘నాగార్జునగారు నన్ను తిట్టారు చూశావా’ అని సన్నీ అడగ్గా, ‘కోపమైనా, ప్రేమ అయిన ఇష్టమైన వారిపైనే ఉంటుంది. నాగార్జున గారు చాలా మంచి వారు’ అంటూ సన్నీని అతడి తల్లి సముదాయించింది. బయటకు వచ్చిన తర్వాత కలవాలని ఉందని చెప్పగా, ‘షూటింగ్ లేని సమయంలో అనుమతి తీసుకుని కలుద్దాం’ అని సన్నీ తన తల్లితో చెప్పాడు. మరోవైపు ప్రియాంక వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని మానస్-కాజల్ మాట్లాడుకున్నారు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో అతడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని మానస్ అన్నాడు.
ఆ విషయం మీ అమ్మకు నువ్వైనా చెప్పు
గురువారం హౌస్‌లోకి వచ్చిన సిరి తల్లి ‘షణ్ముఖ్-సిరి హగ్ చేసుకోవటం నాకు నచ్చలేదు’అని అన్నదానిపై షణ్ముఖ్ తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. గార్డెన్ ఏరియాలో సిరి కూర్చొని ఉండగా ‘ఉన్న కొద్దిరోజులైనా కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఇంట్లో వాళ్లను బాధపెట్టొద్దు. నేను మాత్రం తండ్రిలేని కూతురు అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఈ విషయం దయచేసి నువ్వైనా మీ అమ్మకు చెప్పు’ అని సిరికి షణ్ముఖ్ చెప్పాడు. దీంతో సిరి తలదించుకుని బాధపడింది. ప్రియాంకతో మాట్లాడటానికి ఆమె బంధువు మధు వచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. సన్నీకి తాను ఫ్యాన్ అని మధు చెప్పింది. వెళ్తూ మానస్‌కు సారీ చెప్పింది.
హౌస్‌లో రవి కూతురు సందడి
రవి సతీమణి, కూతురు దియాలు ఇంటి లోపలికి వచ్చారు. దీంతో రవి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ‘నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుంది’ అని దియా చెప్పడంతో రవి ఓదార్చాడు. రవి ఎవరినీ ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేడని అతడి భార్య ఇంటి సభ్యులతో చెప్పింది. అనంతరం ఇంటి సభ్యులందరూ కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొన్నారు. దియాతో కలిసి రవి గార్డెన్ ఏరియాలో కాసేపు ఆటలాడాడు. ‘డాడీ’లో పాటకు చిందేశారు.
గేమ్‌ను గేమ్‌లా ఆడు..: షణ్ముఖ్ తల్లి
అందరితోనూ కలిసి ఆడమంటూ షణ్ముఖ్‌కు అతడి తల్లి సలహా ఇచ్చింది. ‘దీపు ఎలా ఉంది’ అని అడగ్గా ‘చాలా బాగుంది. అమ్మ అబద్ధం చెప్పదు’ అని అన్నది. షణ్ముఖ్‌కు బ్రహ్మ అని పేరు రావటం సంతోషంగా ఉందన్నారు. సిరి తల్లి వచ్చి ఏమన్నారో నువ్వు చూశావా? అని షణ్ముఖ్ తన తల్లిని అడగ్గా, ‘అర్థం చేసుకోగలను’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. అంతలోనే సిరి వచ్చి పలకరించగా ‘గేమ్‌ను గేమ్‌లా ఆడండి. ఎమోషనల్‌గా మారిపోవద్దు’ అని ఇద్దరికీ సలహా ఇచ్చారు. తమ గేమ్ మార్చుకుంటామని, రేపటి నుంచి అందరూ కొత్త ఆటను చూస్తారని ఇద్దరూ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).