83 Movie: భారతీయులంతా కాలరెగరేసుకుని తిరిగిన సంఘటన అది: నాగార్జున
1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు ప్రతి భారతీయుడు కాలరెగరేసుకుని తిరిగారని
హైదరాబాద్: 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు ప్రతి భారతీయుడు కాలరెగరేసుకుని తిరిగారని అగ్ర కథానాయకుడు నాగార్జున(Nagarjuna) అన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఆ చారిత్రక సంఘటనతో తెరకెక్కిన ‘83’(83 Movie) చిత్రాన్ని నేటి యువత తప్పకుండా చూడాలని అన్నారు. 1983 ప్రపంచకప్, కపిల్ దేవ్(kapil dev) జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ఇది. రణ్వీర్ సింగ్(Ranveer Singh), దీపిక పదుకొణె(Deepika Padukone) కీలక పాత్రలు పోషించారు. కబీర్‌ఖాన్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు, ప్రాంతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జునతో పాటు రణ్వీర్ సింగ్, కబీర్‌ఖాన్, కపిల్ దేవ్, శ్రీకాంత్ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నటనారంగంలో ఉన్న వాళ్లకు సరికొత్త పాత్రలు చేయాలన్న పిచ్చి ఉంటుంది. అదే నన్ను కపిల్ పాత్ర పోషించేలా చేసింది. ప్రపంచకప్ గెలుపొందిన టీమ్‌లో ఉన్న సభ్యులు వారి కుటుంబాలతో కలిసి ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం కపిల్‌దేవ్‌తో కొన్నాళ్లు ప్రయాణం చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. శ్రీకాంత్ కృష్ణమాచారి, విశ్వనాథ గుండప్ప, క్లైవ్ లాయిడ్ ఇలా ఆరోజు మ్యాచ్ ఆడిన వాళ్లలో చాలా మంది సినిమాలో వారి పాత్రలు పోషించే వారికి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాంటి వారి దగ్గర ఈ సినిమా కోసం శిక్షణ తీసుకోవడం మా అదృష్టం’’ అని అన్నారు. ‘‘ఇలాంటి మధురానుభూతులను తెరపై చూపించాలంటే, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టాలి. అందుకోసం మేము చాలా రీసెర్చ్ చేశాం. ఆనాడు మ్యాచ్ ఆడిన వాళ్లను చాలా మందిని కలిశాం. కపిల్‌దేవ్‌తో కలిసి కొన్నాళ్లు ప్రయాణించాం’’ అని దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘కబీర్‌ఖాన్ ‘83’ని రెండు భాగాలుగా చూపించారు. ఒకటి క్రికెట్, మరొకటి ఫ్యామిలీ. రెండింటినీ మిళితం చేసి చూపించటం చాలా బాగుంది. తెరపై క్రికెట్ చూపించటం సులభమే. కానీ, ఫ్యామిలీడ్రామా, అదీ ఎమోషనల్‌గా చూపించటం చాలా కష్టం. అలాగే నటులు కూడా సులభంగా నటిస్తారు. కానీ, ఎమోషన్స్ పండించటమే అసలైన సవాల్. నాటి టీమ్ ఇండియా సభ్యులు, వారి కుటుంబం, తల్లిదండ్రులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సినిమాను చూశారు. చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం’’ అని అన్నారు. ‘‘83’లో రణ్వీర్ సింగ్ నాకు కనిపించలేదు. కేవలం కపిల్‌దేవ్ మాత్రమే కనిపించాడు. ఎవరినో పొగడాలని ఇది చెప్పటం లేదు. నా బ్యాటింగ్లాగానే నా మాటలు కూడా ఫటాఫట్ ఉంటాయి. ‘ఏడు కొండల వాడా గోవిందా గోవిందా’ అనుకుంటూ బంతిని బాదేస్తా. అలాగే మాట్లాడతా. అది మీ అందరికీ తెలుసు. సినిమా చూసిన తర్వాతే కపిల్‌దేవ్ వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది. ఇప్పటివరకూ ఆ విషయాలు ఏవీ నాకు తెలియవు. కపిల్ నిరాడంబరతకు హ్యాట్సాఫ్’’ అని టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, 83 ప్రపంచకప్ జట్టు సభ్యులు శ్రీకాంత్ కృష్ణమాచారి చెప్పుకొచ్చారు. తాను నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్మేట్స్ అని, ఆ తర్వాత కొన్ని రోజులకు చూస్తే చైన్ పట్టుకుని ‘శివ’ అవతారమెత్తారని శ్రీకాంత్ నవ్వులు పంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్‌తో విజయ్.. టైటిల్స్‌తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్‌పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్‌నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్‌తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం