83 Teaser: హిస్టారిక్‌ మూమెంట్‌తో ‘83’ టీజర్‌

భారత ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘83’. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 24 ప్రేక్షకుల ముందుకు రానుంది...

Updated : 17 Sep 2022 14:14 IST

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘83’. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ‘83’ టీజర్‌ను అక్కినేని నాగార్జున ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. 1983లో భారత్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ అందుకోవడానికి కారణమైన హిస్టారిక్‌ క్యాచ్‌తో ఈ వీడియోని రూపొందించారు. ఆనాటి రోజులకు అద్దంపట్టేలా సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక, కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కానుంది. కబీర్‌ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కపిల్‌దేవ్ సతీమణిగా రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించారు. తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవి, కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని