Updated : 08/11/2021 13:09 IST

Anushka: ముచ్చటగా మూడోసారి

‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత నటి అనుష్క మరో కొత్త కబురు వినిపించలేదు. యు.వి. క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలొచ్చినా.. కార్యరూపంలోకి రాలేదు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చింది. ఆదివారం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది ఆమెకు 48వ సినిమా. ‘మిర్చి’, ‘భాగమతి’ వంటి   విజయాల తర్వాత యు.వి. బ్యానర్‌లో చేస్తున్న మూడో చిత్రమిది. దీనికి పి.మహేష్‌బాబు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ‘‘ఓ కొత్తతరం కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఏకకాలంలో తెరకెక్కుతుంది. మిగతా నటీనటులు, ఇతర    సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో  ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలియజేశారు. ఇందులో అనుష్క సరసన ఓ యువ కథానాయకుడు కనిపించే అవకాశమున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని