Sai pallavi: ఆ ఆలోచనలు తప్పని...

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పింది నటి సాయి పల్లవి. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ అమ్మడు.. అంతే సహజమైన అభినయంతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా తళుకులీనుతోంది. అయితే తొలి సినిమా సమయంలో

Updated : 07 Dec 2022 16:37 IST

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పింది నటి సాయి పల్లవి. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ అమ్మడు.. అంతే సహజమైన అభినయంతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా తళుకులీనుతోంది. అయితే తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన ఆలోచనలు ఎలా ఉండేవని ప్రశ్నిస్తే... ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘‘కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి. ఎందుకంటే అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది. ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇటీవలే ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె.. త్వరలో ‘విరాటపర్వం’ సినిమాతో బాక్సాఫీస్‌ ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని