Bheemla Nayak: పేరెట్టి నేనెట్టా పిలిచేది

పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. ఇందులో...

Updated : 07 Dec 2022 20:47 IST

వన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మేనన్‌ కనిపించనుంది. ఈ సినిమాలోని ‘‘అంత ఇష్టమేందయ’’ అనే గీతాన్ని దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘‘పేరెట్టి నేనెట్టా పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనిమిటివే’’ అంటూ భార్యాభర్తల అనుబంధాల   నేపథ్యంలో సాగుతున్న ఈ పాటను పవన్‌ -  నిత్యాలపై చిత్రీకరించారు. ఈ గీతానికి తమన్‌   స్వరాలందించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని