shyamsingharoy: అతని ప్రేమ.. అతని వారసత్వం

నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Updated : 15 Oct 2021 07:28 IST

నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే శ్యామ్‌ సింగరాయ్‌గా ఆయన లుక్‌ను చూపించిన చిత్ర బృందం.. ఇప్పుడు వాసుగా మరో పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రేక్షకులకు చూపించింది. దసరా సందర్భంగా గురువారం ఈ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వాసుగా నాని గుబురు గడ్డం.. వెరైటీ హెయిర్‌ కట్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో కాళీమాత విగ్రహాన్ని చూపించారు.  ప్రేమ.. అతని వారసత్వం.. అతని మాట’’ అంటూ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను చూపించారు. కలకత్తా నేపథ్యంలో సాగే ఓ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యం కనిపిస్తుంది.సినిమాని ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని