Ghani: ‘గని’.. కనివిని ఎరుగని

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 15:40 IST

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమా డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలోనే మంగళవారం ‘గని ఆంథమ్‌’ ప్రోమోను విడుదల చేశారు. ‘‘దే కాల్‌ హిమ్‌ గని కనివిని ఎరుగని’’ అంటూ సాగుతున్న ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి పాటను బుధవారం ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో వరుణ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని