Manu Charitra: తుమ్‌ సే మేరా.. ప్యార్‌ హువా

శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. భరత్‌ పెదగాని దర్శకుడు. నరాల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌   సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలోని  ‘‘హమేషా.. హమేషా’’ అనే వీడియో గీతాన్ని ఇటీవల విడుదల చేశారు.

Updated : 08 Nov 2021 09:19 IST

శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. భరత్‌ పెదగాని దర్శకుడు. నరాల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌   సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలోని  ‘‘హమేషా.. హమేషా’’ అనే వీడియో గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ‘‘కనబడకనె తెగతిరుగుతు.. నను వెతికిన తుమ్‌సే మేరా ప్యార్‌ హువా’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా.. రమ్య బెహ్రా ఆలపించింది. ‘‘వరంగల్‌ నేపథ్యంలో సాగే ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీతో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని