Jai Bhim: న్యాయ పోరాటం... ‘జై భీమ్‌’

బాధింపబడ్డ వారికి లభించని న్యాయం... వాళ్లకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుందని  చెబుతున్నాడు ఓ న్యాయవాది.

Updated : 21 Oct 2021 08:17 IST

బాధింపబడ్డ వారికి లభించని న్యాయం... వాళ్లకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుందని  చెబుతున్నాడు ఓ న్యాయవాది. అతను ఎవరికి అండగా నిలిచాడు? వాళ్లకి న్యాయం జరిగేందుకు ఎలా పోరాటం    చేశాడన్నది తెలియాంటే ‘జై భీమ్‌’ చూడాల్సిందే. సూర్య కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. ఆయనే తన అర్ధాంగి జ్యోతికతో కలిసి నిర్మించారు. తా.సే.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అందులో ‘న్యాయం దక్కే వరకు పోరాడదాం’, ‘దొంగలకి కూడా ఒక జాతి ఉంటుందా? నీ జాతిలోనూ నా జాతిలోనూ అందరు జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలుంటారు’ అనే సంభాషణలు వినిపించాయి. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య నటించారని టీజర్‌ని బట్టి స్పష్టమవుతోంది. రావు రమేష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 22న ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని