Cinema News: సరికొత్తగా ‘పాయిజన్‌’

రమణ, షఫీ, కమల్‌, అమిత్‌ విక్రమ్‌, సిమ్రాన్‌, శివన్య, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పాయిజన్‌’. రవిచంద్రన్‌ దర్శకుడు. శిల్పిక.కె నిర్మించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,    మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులోని ‘‘మ్యాడ్‌..’

Updated : 27 Oct 2021 07:22 IST

రమణ, షఫీ, కమల్‌, అమిత్‌ విక్రమ్‌, సిమ్రాన్‌, శివన్య, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పాయిజన్‌’. రవిచంద్రన్‌ దర్శకుడు. శిల్పిక.కె నిర్మించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,    మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులోని ‘‘మ్యాడ్‌..’’ గీతాన్ని నటుడు శ్రీకాంత్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్‌ చాలా క్యాచీగా ఉంది. యువతరాన్ని మెప్పించేలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని చిత్ర బృందానికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఓ సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఖర్చుకు వెనకాడకుండా ఉన్నతంగా నిర్మించారు. పాట విడుదల చేసినందుకు శ్రీకాంత్‌కు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. హీరో రమణ మాట్లాడుతూ.. ‘‘మ్యాడ్‌’ పాట కోసం జర్మన్‌ నుంచి ఏబూల్టన్‌ మ్యూజిక్‌ను దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడీ గీతాన్ని శ్రీకాంత్‌ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: డి.జె.నిహాల్‌, ఛాయాగ్రహణం: ముత్తు కుమరన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు