
Sarkaru Vaari Paata: పాటలు పూర్తి
మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో చిత్రీకరణ జరుపుకొంటోంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించిన పాటల కంపోజిషన్ పూర్తయినట్లు సంగీత దర్శకుడు తమన్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్లో మహేష్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న ఓ కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బ్యాంక్ రికవరీ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం బార్సిలోనాలో పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.