Natyam: విమర్శలకు సమాధానమిది

‘కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా? అని చాలా మంది విమర్శించారు. ‘నాట్యం’ చిత్రం ‘ఇఫి’కి ఎంపికై వాళ్ల విమర్శలకు పెద్ద సమాధానమిచ్చిందని భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు...

Updated : 07 Nov 2021 07:11 IST

‘‘కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా? అని చాలా మంది విమర్శించారు. ‘నాట్యం’ చిత్రం ‘ఇఫి’కి ఎంపికై వాళ్ల విమర్శలకు పెద్ద సమాధానమిచ్చిందని భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు ఈ చిత్రం మరింత గుర్తింపు తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నటి, నిర్మాత సంధ్యారాజు. ‘నాట్యం’ సినిమాని రేవంత్‌ కోరుకొండ తెరకెక్కించారు. కమల్‌ కామరాజు, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి)లో  ప్రదర్శనకు ఈ సినిమా ఎంపిక కావడంతో ఆ చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ‘‘తెలుగు సంస్కృతుల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత ప్రమాణాలతో సంధ్యారాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంత మంచి సినిమాలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నా’’ అన్నారు కమల్‌ కామరాజు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇఫి’కి ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా ‘నాట్యం’ నిలవడం ఎంతో గర్వంగా ఉంద’’న్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని