Romantic: హ్యాపీ హ్యాపీ మామ.. దిల్‌ ఖుష్‌ అయితదే

ఆకాష్‌ పురి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు.

Updated : 13 Oct 2021 07:03 IST

కాష్‌ పురి, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. సునీల్‌ కశ్యప్‌ స్వరాలందించారు. ఈ సినిమాలోని మూడో లిరికల్‌ గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ‘‘హ్యాపీ హ్యాపీ మామ.. దిల్‌ ఖుష్‌ అయితదే.. పీనే కే బాద్‌’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు భాస్కర భట్ల, పూరి జగన్నాథ్‌ సాహిత్యం అందించగా.. సునీల్‌ కశ్యప్‌ ఆలపించారు. జానీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘కొత్తదనమున్న ప్రేమ కథాంశంతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఆకాష్‌, కేతిక కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని