Cinema News: ‘పాయిజన్‌’ కథేంటి?

రమణ, షఫి, కమల్‌, సిమ్రాన్‌, శివన్య, సారిక, అర్చన తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పాయిజన్‌’. రవిచంద్రన్‌ దర్శకుడు. శిల్పిక.కె నిర్మాత. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

Updated : 14 Oct 2021 07:15 IST

రమణ, షఫి, కమల్‌, సిమ్రాన్‌, శివన్య, సారిక, అర్చన తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పాయిజన్‌’. రవిచంద్రన్‌ దర్శకుడు. శిల్పిక.కె నిర్మాత. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. మోషన్‌ పోస్టర్‌ వైవిధ్యభరితంగా ఉంది. ఓ బెంచ్‌ మార్క్‌ చిత్రం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ల్‌థ్రిల్లర్‌ మిస్టరీ జానర్లో నడుస్తుంది. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: డి.జె.నిహాల్‌, ఛాయాగ్రహణం: ముత్తు కుమరన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని