Back Door: విడుదలకి సిద్ధం

పూర్ణ ప్రధాన పాత్రధారిగా కర్రి బాలాజీ దర్శకత్వంలో తెర  కెక్కుతున్న చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. తేజ త్రిపురాన కథానాయకుడిగా నటించారు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. దీపావళి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ....

Updated : 14 Oct 2021 07:19 IST

పూర్ణ ప్రధాన పాత్రధారిగా కర్రి బాలాజీ దర్శకత్వంలో తెర  కెక్కుతున్న చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. తేజ త్రిపురాన కథానాయకుడిగా నటించారు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. దీపావళి సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు సినిమా వర్గాలు  వెల్లడించాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘కుర్రకారుని కట్టిపడేసే అంశాలతో కూడిన చిత్రమిది. సమకాలీన అంశాల్ని ఇందులో ప్రస్తావించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్‌, రవిశంకర్‌, కళ: నాని, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని