MAA Elections: ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉందంటూ ఆరోపణలు చేశారు ప్రకాశ్‌రాజ్‌. ఆ మేరకు కొన్ని ఆధారాలతో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి లేఖ...

Updated : 23 Oct 2021 10:20 IST

ప్రకాష్‌రాజ్‌ ఆరోపణ

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఉందంటూ ఆరోపణలు చేశారు ప్రకాశ్‌రాజ్‌. ఆ మేరకు కొన్ని ఆధారాలతో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన ట్వీట్‌ చేశారు. అందులో జగ్గయ్య పేటకి చెందిన వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో మంచు విష్ణుతో కలిసున్న ఫొటోని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసున్న ఫొటోని పంచుకున్నారు. సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులూ ఉన్నాయంటూ, అందుకు సంబంధించిన ఆధారాల్ని ట్విటర్‌లో పంచుకున్నారు ప్రకాశ్‌రాజ్‌. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలోకి ఇలా వేరొకరిని ఎలా అనుమతించారంటూ తన లేఖలో ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ‘ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికలు ఎలా జరిగాయి? పోలింగ్‌ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియాలి’ అంటూ ట్వీట్‌ చేశారు ప్రకాశ్‌రాజ్‌.

వీడియో కెమెరాల ఫుటేజీ ఇచ్చే అధికారం అధ్యక్షుడి చేతుల్లోనే..
దీనిపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ని ‘ఈనాడు సినిమా’ సంప్రదించగా, తనకి ప్రకాశ్‌రాజ్‌ లేఖ మెయిల్‌ ద్వారా అందిందనీఅయితే సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చే అధికారం తన చేతుల్లో లేదని, ఎన్నికల అనంతరం అధికారం అంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందని చెప్పారు.

సునీతాకృష్ణన్‌ సలహాదారుగా...
చిత్ర పరిశ్రమలోని మహిళల రక్షణ నిమిత్తం పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్‌ గౌరవ సలహాదారుగా మహిళల సాధికారికత- ఫిర్యాదు సెల్‌కి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ కమిటీ విశాఖ గైడ్‌లైన్స్‌ని అమలు చేయడం కోసం పనిచేస్తుందని, త్వరలోనే ఈ కమిటీని వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని