Bollywood: షాహిద్‌ - సేతుపతి.. ‘ఫేక్స్‌’!

షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ‘ఫ్యామిలీమెన్‌’ దర్శకులు రాజ్‌ నిడమోరు, కృష్ణ డికె సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇది త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఈ సిరీస్‌కు ‘సన్నీ’  

Updated : 08 Nov 2021 12:58 IST

షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ‘ఫ్యామిలీమెన్‌’ దర్శకులు రాజ్‌ నిడమోరు, కృష్ణ డికె సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇది త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఈ సిరీస్‌కు ‘సన్నీ’   అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే   బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌కు ‘ఫేక్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌ - డికె గతంలో ఈ కథను ‘ఫర్జీ’ అనే పేరుతో షాహిద్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీలతో చేయాలనుకున్నారు. ఇప్పుడా కథలోని నవాజుద్దీన్‌ చేయాల్సిన పాత్రనే విజయ్‌ సేతుపతి పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ఈ సిరీస్‌.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని