srikanth: దేవుడు వస్తున్నాడు

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్‌ వడత్యా దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత.

Updated : 08 Nov 2021 09:43 IST

ద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్‌ వడత్యా దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రమిది. శ్రీకాంత్‌ ఉద్యమ నాయకుడిగా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రని పోషించారు. ఆయన చిత్రానికి అందించిన సహకారం మరిచిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, బ్రహ్మాజీ, వెంకట్‌, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నందన్‌ బొబ్బిలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని