Mamootty: కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన.. మమ్ముట్టిపై కేసు నమోదు

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు మలయాళీ ప్రముఖ నటుడు మమ్ముట్టితోపాటు మరో 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేశ్‌ పిషరోడీ కూడా ఉన్నారు. ఈ నెల మూడో తేదీన కోజికోడ్‌లోని....

Updated : 09 Aug 2021 13:41 IST

తిరువనంతపురం: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టితోపాటు మరో 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేశ్‌ పిషరోడీ కూడా ఉన్నారు. ఈ నెల మూడో తేదీన కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మమ్ముట్టి, రమేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోబో సాంకేతికత ఆధారంగా కీళ్లమార్పిడి శస్త్రచికిత్స సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో స్థానికులు హాజరయ్యారని.. ఆస్పత్రి యాజమాన్యం కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదంటూ ఓ వ్యక్తి పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మమ్ముట్టి, రమేశ్‌తోపాటు ఆస్పత్రి బృందంపై కూడా కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆస్పత్రి ఆవరణలో కొవిడ్‌ నిబంధలు పాటించామని, సామాజిక దూరం ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కాకపోతే కార్యక్రమం అనంతరం మమ్ముట్టి బయటకు రాగానే వందలాది మంది ఆయన్ని చూసేందుకు గుమిగూడారని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని