
AAha: ‘సినిమాపురం’ ప్రోమో చూశారా..!
హైదరాబాద్: సరికొత్త ప్రోగ్రామ్‌లు, షోలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా సిద్ధమైంది. ఇప్పటికే ‘సామ్‌జామ్’, ‘నంబర్ 1 యారీ’, ‘నాన్స్టాపబుల్’ వంటి సెలబ్రిటీ షోలతో అలరిస్తోన్న ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమైంది. ‘సినిమాపురం’ పేరుతో దీనికి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోని తాజాగా విడుదల చేసింది. సినిమాపురంలోని ప్రజలకు సినిమా అంటే ఎంతో ఇష్టమని అల్లు అర్జున్‌కు ఆయన మేనేజర్ చెబుతూ కనిపించారు. అనంతరం, ‘సినిమాపురం’ గ్రామం చెక్‌పోస్ట్ వద్ద గేట్ పడటంతో బన్నీ తన వాహనం నుంచి బయటకు వస్తూ కనిపించారు. అసలు ఈ ‘సినిమాపురం’ కాన్సెప్ట్ ఏమిటి? షో ఎప్పుడు ప్రారంభం కానుంది? అనే విశేషాలు తెలియాల్సి ఉంది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.