Aakashavaani: తప్పుని చూస్తూ ఊరుకున్నవాడిదే పెద్ద తప్పు!

స‌ముద్ర ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఆకాశవాణి’. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Published : 21 Sep 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స‌ముద్ర ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఆకాశవాణి’. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓటీటీ ‘సోనీ లివ్‌’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రభాస్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘మనం బతికినా చచ్చినా, తిన్నా పస్తులున్నా.. కారణం దేవుడు, దొర’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. ట్రైలర్‌బట్టి చూస్తుంటే అడవి సమీపాన ఉండే గూడెం ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కంచనున్నట్టు అర్థమవుతోంది. ‘గొర్రెలకి కొమ్ములు, గూడేనికి దమ్ములు ఉండకూడదు’, ‘తప్పు చేసినవాడికంటే చూస్తూ ఊరుకున్నవాడిదే పెద్ద తప్పు’ అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మధ్యలో వచ్చే రేడియో సన్నివేశం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. మరి ఆ రేడియో కథేంటి? ‘ఆకాశవాణి’ ఏం చెప్తుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప‌ద్మ‌నాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని