Cinema News: అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే పాట విన్నారా..!

సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. చైతన్య కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.....

Published : 03 Sep 2021 12:19 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. చైతన్య కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయివే’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. సత్య కశ్యప్‌ సంగీతం అందించగా సాయి చరణ్‌ ఈపాటను ఆలపించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని