Akhil: నేనెక్కడికీ వెళ్లను.. ఇక్కడే ఉండాలని ఉంది: అఖిల్
అక్కినేని అఖిల్ ఇంటర్వ్యూ. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా గురించి అఖిల్ చెప్పిన విశేషాలివీ...
ఇంటర్నెట్ డెస్క్: సరిగా మాటలు కూడా రాని వయసులోనే నటించి, అందరి దృష్టిని ఆకర్షించాడు. కట్ చేస్తే, ‘అఖిల్’ చిత్రంతో హీరోగా మారాడు. అందం, అభినయంలో అక్కినేని వారసుడు అనిపించుకున్నాడు. ‘హలో’ ,‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలతో మెప్పించి, ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా సందడి చేయబోతున్నాడు. ఆ ‘సిసింద్రీ’ ఎవరో కాదు అక్కినేని అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 15న విడుదలకానుంది. ఈ సందర్బంగా అఖిల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
రొమాన్స్ అంటే అది కాదు..
నిర్మాత అరవింద్‌గారు ఓ లవ్‌స్టోరీ చేయాలన్నప్పుడు ‘అబ్బా! ఇంకో లవ్‌స్టోరీనా’ అని ఫీలయ్యా. ప్రేమ కథంటే గొప్పగా ఏముంటుంది? రొటీనే కదా అని అనుకుంటూనే ఆయన ఆఫీసుకి వెళ్లా. అక్కడ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కథ వినిపించారు. ప్రేమ, పెళ్లి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రేమకథే అయినా చాలా కొత్తగా అనిపించింది. ఒకనొకరు తాకడం ఒక్కటే రొమాన్స్ కాదని ఈ చిత్రంలో చూపించాం. ప్రేయసికి లేఖ రాయడం రొమాన్సే, పువ్వు ఇవ్వడమూ రొమాన్సే. ఇలాంటి ఎన్నో విషయాల్ని భాస్కర్‌గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు.
నిజాయతీగా నటించా..
కమర్షియల్ ఫార్ములా అనే సేఫ్ జోన్ నుంచి బయటికొచ్చి నిజాయతీగా నటించిన చిత్రమిది. తెరపై నేను కాదు నా పాత్ర మాత్రమే కనిపించాలనుకున్నా. అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకున్నా. నేను హర్ష అనే పాత్రలో కనిపిస్తా. ఓ దశలో అల్లరి చేసే యువకుడిగా, కొన్ని సన్నివేశాల్లో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా రెండు విభిన్న కోణాలు ఆవిష్కరించా. బాయ్ నుంచి మ్యాన్‌గా మారే క్రమంలో హర్ష ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇబ్బంది పడతా..
కథని బలంగా నమ్మాను. భాస్కర్ గత చిత్రం ‘బొమ్మరిల్లు’లో క్లైమాక్స్ అందరినీ హత్తుకుంది. అదొక్కటే కాదు ఏ సినిమాకైనా క్లైమాక్సే ముఖ్యమైంది. ఇందులోనూ మంచి ముగింపు ఉంటుంది. ఇలాంటి విషయాల్లో భాస్కర్ పక్కాగా ఉంటారు. విభావరి అనే పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. స్టాండప్ కమెడియన్‌గా ఆమె నటన అందరినీ అలరిస్తుంది. ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న పాత్ర అది. ఎక్కడా అసభ్య పదజాలం ఉండదు. కొన్ని స్పైసీ సంభాషణలు ఉన్నా మనం ఓపెన్ మైండ్‌తో చూస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు.
ఆ ఆసక్తి లేదు..
ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ కాన్సెప్ట్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ప్రేక్షకులకి గుర్తుండిపోతారు. ‘జాతి రత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఆ చిత్రం విడుదలకి ముందే ‘బ్యాచ్‌లర్’లో నటించింది. ‘సిసింద్రీ’ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి ఆమనిగారితో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నేనెప్పుడూ సినిమా ఫలితం గురించి ఆలోచించను. ఎంపిక చేసుకున్న పాత్రకి న్యాయం చేసేందుకు నా వంతు కృషి చేస్తా. కెరీర్ పరంగా వేగం పెంచాలనుకున్న సమయంలో కొవిడ్ వచ్చింది. కొత్త ప్రాజెక్టుల గురించి త్వరలో తెలియజేస్తా. ప్రస్తుతానికి బాలీవుడ్, హాలీవుడ్‌కి వెళ్లే ఆసక్తి లేదు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. నేను తెలుగు హీరోగానే ఉంటా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!