Allu Arjun: కాకా హోటల్‌లో అల్లు అర్జున్‌.. నెటిజన్లు ఫిదా!

ఓ కాకా హోటల్‌లో ప్రముఖ నటుడు అర్జున్‌ అల్పాహారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 13 Sep 2021 15:35 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో తినడం ఎప్పుడైనా చూశారా? అయినా ఆయన అలాంటి హోటల్‌కి ఎందుకెళ్తారనే కదా మీ సందేహం. దీనికి తగిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్‌ ఓ కాకా హోటల్‌లో అల్పాహారం తీసుకుని, హోటల్ యజమానికి డబ్బులిస్తున్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు’ అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియోలో అర్జున్‌ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. అర్జున్‌ నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ కాకినాడ పోర్టులో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్‌ ఇలా సరదాగా బయటికి వచ్చి, ఆ హోటల్‌కి వెళ్లారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత సుకుమార్‌- అర్జున్‌ కలిసి పనిచేస్తుండటంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని