
Kamal Haasan: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్‌హాసన్
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందిస్తోన్న శ్రీరామచంద్ర ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కమల్‌హాసన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ‘కమల్‌హాసన్ స్వల్ప కొవిడ్ లక్షణాలతో నవంబరు 22న మా ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడాయన కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయినా మరో రెండు రోజులు మా సంరక్షణలోనే ఉంటారు. డిసెంబరు 3న డిశ్చార్జ్ చేస్తాం. మరుసటి రోజు నుంచే ఆయన తన పనుల్ని పునఃప్రారంభించవచ్చు’ అని పేర్కొన్నాయి. ఇటీవల అమెరికా ట్రిప్ ముగించుకుని నగరానికి చేరుకున్న కమల్‌హాసన్ దగ్గు వస్తుండటంతో వైద్యుల్ని సంప్రదించారు. పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణకావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.