
Kiran Abbavaram: అన్నయ్య మృతితో నటుడు తీవ్ర భావోద్వేగం
హైదరాబాద్: ‘రాజావారు.. రాణీవారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రాలతో ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందుకు వెళ్తున్న హీరో కిరణ్ అబ్బవరం భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు రామాంజులును గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఇన్స్టా వేదికగా తన అన్నయ్యతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
‘‘రేయ్ కిరణ్.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. అలాంటి ఊరి కోసం మనం ఏదో ఒకటి చేయాలి’’ అంటూ తనకి వీలైనంత దానికంటే ఎక్కువగా నన్ను సపోర్ట్ చేశాడు. నన్ను హీరోగా చూడటం కోసం తన ఆనందాలను వదులుకున్నాడు. కెరీర్లో ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాననుకునే సమయంలో మా అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు. ‘నన్ను ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తావురా’ అని తరచూ అడుగుతుండేవాడు. ఏదైనా గట్టిగా సాధించిన తర్వాత పరిచయం చేయాలనుకున్నా.. కానీ, ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు. నా వెనుక ఉంది మా అన్నయ్య ‘‘అబ్బవరం రామాంజులు రెడ్డి’’. రోడ్డు ప్రమాదం కారణంగా ఇటీవల కన్నుమూశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఆనందం కోసం కష్టపడే వాళ్లు ఉంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అని కిరణ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.