Manchu Manoj: మంచు మనోజ్‌కు కొవిడ్‌

నటుడు మంచు మనోజ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే

Updated : 30 Dec 2021 07:02 IST

నటుడు మంచు మనోజ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్ష చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ఎవరూ నా గురించి ఆందోళన చెందకండి. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు మనోజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని