Updated : 24 Nov 2021 10:50 IST

Jayamma Panchayathi: సుమ ‘పంచాయతీ’కి నాని.. తొలి పాట వినిపించి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. కలివారపు విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా.. ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. రామాంజనేయులు రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఆలపించారు. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనుష్‌ కుమార్‌. ఈ చిత్రంలో సుమ ఓ గ్రామ పెద్దగా కనిపించనున్నారు. 

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని