MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ఫొటోలు ఇవిగో : ప్రకాశ్‌రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతున్నా పరిశ్రమలో వివాదాలు సద్దుమణగడం లేదు. ‘మా’ పోలింగ్‌లో ఓ రాజకీయ పార్టీకి...
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతున్నా పరిశ్రమలో వివాదాలు సద్దుమణగడం లేదు. ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఎన్నికల హాల్‌లోకి వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు. సాంబశివరావు ఎన్నికల హాల్‌లోని ఓటర్లను బెదిరించారంటూ.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు. అంతేకాకుండా జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
‘‘కృష్ణమోహన్ గారు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికైనా మాకు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వండి. ఎన్నికల ఎలా జరిగాయి.. పోలింగ్ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి’’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
-
General News
Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత
-
Crime News
Crime News: పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!
-
India News
Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక.. సీఈసీ ఏం చెప్పారంటే..?