Jai Bhim: ‘జై భీమ్‌’ వివాదంపై ప్రకాశ్‌రాజ్‌ ఏమన్నారంటే?

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జై భీమ్‌’. నేరుగా ఓటీటీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)లో విడుదలైన ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులూ సూర్య నటనను, సినిమాని కీర్తిస్తున్నారు.

Published : 07 Nov 2021 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జై భీమ్‌’. ఇటీవల నేరుగా ఓటీటీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)లో విడుదలైన ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులు సూర్య, లిజోమోల్‌ నటనను, సినిమాని కీర్తిస్తున్నారు. మరోవైపు, సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ నటించిన ఓ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఈ చిత్రంలో విచారణాధికారి పెరుమాళ్ల స్వామి పాత్ర పోషించారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అది నచ్చని ప్రకాశ్‌రాజ్‌ అతని చెంపపై కొట్టి తమిళంలో మాట్లాడమంటాడు. ప్రకాశ్‌రాజ్‌ అలా చేయడమే వివాదాస్పదమైంది. హిందీ మాట్లాడేవారంతా ఆ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమని అపహాస్యం చేయడమేనని సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగిస్తున్నారు. ఈ విషయంపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.

‘ఇందులో చూపించిన గిరిజనుల బాధలు, న్యాయం కోసం వారు చేసిన పోరాటాన్ని పక్కనపెట్టి కొందరు చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టిపెట్టారు. వారు ఈ సినిమాలో దాన్ని మాత్రమే చూశారు. వారి ఎజెండా ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పించుకునే మార్గం కోసం స్థానిక భాష తెలిసినా హిందీలో మాట్లాడుతుంటే ఏ పోలీసు అధికారి అయినా ఎలా స్పందిస్తారు? నా పాత్ర అలానే స్పందించింది’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని