
Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!
ఇంటర్నెట్ డెస్క్: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ‘గణేశ్‌ది గొప్పమనసు’ అంటూ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే.. నేపాల్‌కు చెందిన ఓ చిన్నారిని గణేశ్ దత్తత తీసుకున్నారు. ఎవరికీ తెలియని ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొందరు కుక్క పిల్లల్ని, మరికొందరు ఇతర జంతువుల్ని పెంచుకుంటుంటారు. వాటి కోసం చాలా ఖర్చుపెడుతుంటారు. నాకు అది విచిత్రమనిపిస్తుంటుంది. ఈ పాపకు పాలు తప్ప మరేం ఇవ్వలేని పరిస్థితి వాళ్లమ్మది. ఆ దుస్థితి చూసి నా భార్య చలించిపోయింది. ఆ పాపను తీసుకుందామని కోరింది. అలా దత్తత తీసుకున్నా. ఈ చిన్నారి నెల వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చింది. తనకు ఏలోటూ రాకుండా చూసుకోవాలనేది నా కోరిక’ అని తెలిపారు. సంబంధిత వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అలా ఈ వీడియోలోని గణేశ్ మాటలు విన్నవారంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటుడిగా అలరించిన గణేశ్ ‘ఆంజనేయులు’తో నిర్మాతగా మారారు. ‘డేగల బాబ్జీ’ సినిమాతో హీరోగా పరిచయంకానున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
► Read latest Cinema News and Telugu News