
Rajkumarrao: రాజ్కుమార్రావ్ నిశ్చితార్థం
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్రావ్ తన ప్రియురాలు, నటి పత్రలేఖతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చంఢీగర్లో జరిగిన ఈ వేడుకకు ఫరాహ్ ఖాన్, సఖిబ్ సలీమ్ తదితర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కనుల పండువగా సాగిన ఈ వేడుకలో మోకాళ్ల మీద కూర్చొని రాజ్కుమార్రావ్ పత్రలేఖకు రింగ్ ఇచ్చి ప్రపోజ్చేశాడు. ఈ మేరకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. వీరిద్దరూ కలిసి ‘సిటీలైట్స్’, ‘బోస్: డెడె-అలైవ్’ చిత్రాల్లో నటించారు. ‘నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి నిశ్చితార్థం సిద్ధమయ్యార’ని స్నేహితులు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.