Salman Khan: ‘సల్మాన్‌ఖాన్‌ కోలుకున్నారు’.. హెల్త్‌ అప్‌డేట్‌

పాము కాటుకు గురైన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ పూర్తిగా కోలుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Published : 26 Dec 2021 22:32 IST

ముంబయి: పాము కాటుకు గురైన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ పూర్తిగా కోలుకున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం పాన్వేల్‌లోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరంలేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఫాంహౌస్‌లో చాలా పాములు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలంటూ సిబ్బందికి సల్మాన్‌ తరచూ సూచించేవారని.. సల్మాన్‌కు ఇలా జరగటం ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణమిదీ..

డిసెంబరు 27.. సల్మాన్‌ఖాన్‌ పుట్టినరోజు. తన ఫాంహౌస్‌లో కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలో తన బర్త్‌డే వేడుకలు జరుపుకోనున్నారు. సల్మాన్‌ ఆహ్వానం మేరకు ఇప్పటికే కొందరు స్నేహితులు ఆ ఫాంహౌస్‌కి విచ్చేశారు. శనివారం సల్మాన్‌ సహా వారంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ పాము సల్మాన్‌ఖాన్‌ను కరిచింది. దీన్ని గమనించిన స్నేహితులు, సిబ్బంది వెంటనే సల్మాన్‌ను ఆస్పత్రికి తరలించారు. విషం లేని పాము కాటువేయడంతో ప్రమాదం తప్పిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని