Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్‌

లాక్‌డౌన్‌ సమయంలో అడిగిన వారందరికీ సాయం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. ఆ సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నారాయన.

Published : 21 Oct 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ సమయంలో అడిగిన వారందరికీ సాయం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. ఆ సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నారాయన. ఇప్పటికే ఎంతోమందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించిన ఆయన ఇటీవల మరో చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. చికిత్సకి రూ. 6 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. తమకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారిని కాపాడుకోలేకపోతున్నామని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తిరువూరు (కృష్ణా జిల్లా) జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోనూసూద్‌ వెంటనే స్పందించి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారి గుండెకి ఆపరేషన్‌ చేయించారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  బాలుడి తల్లిదండ్రులు సోనూసూద్‌ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని