రామ.. ‘ఫ్యామిలీ డ్రామా’

‘కలర్‌ ఫొటో’ చిత్రంతో మంచి విజయం అందుకున్న నటుడు సుహాస్‌ మరో వైవిధ్య కథకి పచ్చజెండా ఊపారు. మెహర్‌ తేజ్‌ దర్శకత్వంలో  ‘ఫ్యామిలీ డ్రామా’ అనే చిత్రాన్ని ఖరారు చేశారు.

Published : 20 Jul 2021 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో మంచి విజయం అందుకున్న నటుడు సుహాస్‌ మరో వైవిధ్య కథకి పచ్చజెండా ఊపారు. మెహర్‌ తేజ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ డ్రామా’ అనే చిత్రాన్ని ఖరారు చేశారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. స్కెచ్‌తో గీసిన సుహాస్ రూపంతోపాటు మధ్య వయస్కుడు, వృద్ధుడి పాత్రలూ దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మూడు తరాలకు సంబంధించిన కథ అనిపిస్తుంది. ఈ సినిమాలో రామ అనే పాత్ర పోషిస్తున్నాడు సుహాస్‌. పూజ కిరణ్‌, శ్రుతి నాయికలు. చష్మా ఫిల్మ్స్‌, నూతన భారతి ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌, సంజయ్‌. ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌. శాకమూరి. కూర్పు: రామకృష్ణ అర్రం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని