Suman: ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ భేదం సరికాదు: సుమన్‌

‘మా’ ఎన్నికల విషయంపై స్పందించిన సీనియర్‌ నటుడు సుమన్‌. లోకల్‌, నాన్‌లోకల్‌ గురించి మాట్లాడారు.

Updated : 05 Oct 2021 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో స్థానికులు, స్థానికేతరులు అనడం భావ్యం కాదు’ అని సీనియర్‌ నటుడు సుమన్‌ అన్నారు. గాజువాకలో నిర్వహించిన కరాటే ఛాంపియన్‌షిప్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ‘మా’ ఎన్నికల అంశం గురించి స్పందించారు. ‘‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ భేదాలు చూడం సరికాదు. అవకాశం వచ్చినప్పుడు అందరం అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తున్నాం. టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది సీనియర్‌ నటులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు కూడా లేని జూనియర్‌, సీనియర్‌ ఆర్టిస్టులకి ఓల్డేజ్‌ హోమ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొవిడ్‌ కారణంగా వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ‘మా’ ఎన్నికల్లో గెలిచిన వారు వీరిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలి’’ అని కోరారు.  ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటీపడుతున్నారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని