Vivaha Bhojanambu: తెలుగు ప్రేక్షకులకు సందీప్‌ కిషన్‌ ఆఫర్‌

స్వీయ నిర్మాణంలో తను కీలక పాత్ర పోషించిన చిత్రాన్ని చూసేందుకు సందీప్‌ కిషన్‌ 1000 కుటుంబాలకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. తనని ఆదరించిన ప్రేక్షకులతో ఆ సినిమా సంబరాన్ని జరుపుకోవాలనుందన్నారు. సత్య కథానాయకుడిగా రామ్‌ అబ్బరాజు రూపొందించిన ‘వివాహ భోజనంబు’ చిత్రంలో సందీప్‌ అతిథిగా నటించారు.

Published : 19 Aug 2021 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వీయ నిర్మాణంలో తాను కీలక పాత్ర పోషించిన ‘వివాహ భోజనంబు’ చిత్రాన్ని చూసేందుకు 1000 కుటుంబాలకు సందీప్‌ కిషన్‌ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. తనను ఆదరించిన ప్రేక్షకులతో ఆ సినిమా విడుదల సంబరాన్ని జరుపుకోవాలనుందన్నారు. సత్య కథానాయకుడిగా రామ్‌ అబ్బరాజు రూపొందించిన ఈ చిత్రంలో సందీప్‌ అతిథిగా నటించిన సంగతి తెలిసిందే. కె.ఎస్‌. శినీష్‌తో కలిసి సందీప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోని లివ్‌ ఓటీటీ వేదికగా ఆగస్టు 27న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులకు సందీప్‌ ఓ లేఖ రాశారు. ‘వివాహ భోజనంబు.. వినోదాత్మక చిత్రం. 2 గంటలపాటు కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన దర్శకనటులు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రంతో కొంతమంది కొత్త వారిని పరిచయం చేస్తున్నందుకు నిర్మాతగా ఆనంద పడుతున్నా. నేనిలా ఉండటానికి కారణమైన తెలుగు ప్రేక్షకులతో ఈ సినిమా విడుదలను సంబురంలా జరపాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్‌ పోస్టర్‌తో మీ ఫ్యామిలీ ఫొటో జతచేసి, షేర్‌ చేయండి. సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను నా నుంచి బహుమతిగా స్వీకరించండి’ అని తెలిపారు. ఇలా పోస్ట్‌ చేసిన తొలి 1000 మందికి సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందించనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని