Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న విజయ్‌.. షణ్ముఖ ప్రియకి అవకాశం

ప్రముఖ గాయని షణ్ముఖ ప్రియకి తన సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన విజయ్‌ దేవరకొండ.

Published : 06 Sep 2021 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సింగింగ్ షో ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12’లో మెరిసిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకి ఇచ్చిన మాటని విజయ్‌ దేవరకొండ నిలబెట్టుకున్నారు. తను నటిస్తోన్న ‘లైగర్‌’ చిత్రంలో ఆమెతో ఓ పాట పాడించారు. తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి, ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు. ‘విజయ్‌ దేవరకొండకి నేను అభిమానిని. అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని, నాకు మద్దతిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నేను నమ్మలేకపోతున్నా’ అని విజయ్‌ని కలవకముందు షణ్ముఖప్రియ మనసులోని మాట ఇది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్‌ షేర్‌ చేసిన వీడియోలో చూపించారు. త్వరలోనే షణ్ముఖ ఆలపించిన గీతాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షణ్ముఖగానం విజయ్‌ని విశేషంగా ఆకట్టుకోవడంతో ‘‘ఇండియన్‌ ఐడల్‌’లో నువ్వు ఓడినా, గెలిచినా హైదరాబాద్‌ వచ్చాక మనం కలుస్తాం. నువ్వు నా సినిమాలో పాడతావ్‌. ఇది డీల్‌’ అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వాగ్ధానం నెరవేర్చారు.

విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని