Viswaksen: నటుడు విశ్వక్‌ సేన్‌కు కొవిడ్‌

నటుడు విశ్వక్‌సేన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...

Updated : 31 Dec 2021 16:19 IST

హైదరాబాద్‌: నటుడు విశ్వక్‌సేన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యులు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నా. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడటం దురదృష్టకరం. కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి దయచేసి అందరూ మాస్కులు ధరించండి. మీ కుటుంబ సభ్యులనూ జాగ్రత్తగా చూసుకోండి’’ అని విశ్వక్‌ పోస్ట్‌ పెట్టారు. మరోవైపు విశ్వక్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘‘గెట్‌ వెల్‌ సూన్‌ అన్నా’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని