Meena: కరోనా బారిన నటి మీనా కుటుంబం

మీనా కుటుంబానికి కరోనా. పోస్ట్‌ పెట్టిన నటి.. జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరారు..

Published : 05 Jan 2022 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనతోసహా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్టు నటి మీనా సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘‘2022లో మా ఇంటికి విచ్చేసిన తొలి అతిథి కరోనా. దానికి మా కుటుంబమంతా నచ్చింది. అయినా సరే దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. కరోనాను వ్యాప్తి చేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు, కొందరు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది ‘దృశ్యం 2’, ‘పెద్దన్న’ చిత్రాలతో అలరించిన మీనా ప్రస్తుతం ‘బ్రో డాడీ’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని