Published : 26/11/2021 22:35 IST

Akhanda: ‘మీరు మనిషేనా?’ అని బాలకృష్ణని అడిగేశా: ప్రగ్యా

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందం, అభినయం కలగలిసిన నాయికల్లో ప్రగ్యా జైస్వాల్‌ ఒకరు. ‘కంచె’, ‘జయ జానకి నాయక’ తదితర చిత్రాలతో ఇదే అంశాన్ని చాటిచెప్పిన ముద్దుగుమ్మ ‘అఖండ’తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 2న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రగ్యా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నా పాత్రే కీలకం..

ద్వారక క్రియేషన్స్‌ సంస్థలో నేను నటించిన రెండో చిత్రమిది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. తాను రాసుకున్న పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలా నేనీ ప్రాజెక్టులో అడుగుపెట్టాను. ఆయనపై నాకున్న నమ్మకంతో కథను పూర్తిగా వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పా. నేనీ చిత్రంలో ఐఏఎస్‌ శ్రావణ్య అనే పాత్ర పోషించా. దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకు కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా. ఇందుకు ఎంతో శ్రమించా. నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నా. సినిమాకే కీలకంగా నిలిచే పాత్ర అది. ఆ క్యారెక్టర్‌ చుట్టే కథ తిరుగుతుంది. ఆ పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల కథానాయకుడి రెండో క్యారెక్టర్‌ ‘అఖండ’ దర్శనమిస్తుంది.

పాట కోసం ఎదురుచూస్తున్నా..

‘అఖండ’లాంటి కథ, అందులోని పాత్రల్ని నేనింతవరకూ వినలేదు, చూడలేదు. తెలుగులోనే కాదు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఇలాంటి పవర్‌ఫుల్‌ సినిమా వచ్చుండదు. ఇందులోని పాటలు ఇతర కమర్షియల్‌ చిత్రాల్లో ఉన్నట్టుగా ఉండవు. ఈ సినిమా సంగీతంలో వైవిధ్యం ఉంది. వ్యక్తిగతంగా నాకు డ్యాన్స్‌ చేయడమంటే ఇష్టం. ఓ పాటలో నా నృత్య ప్రతిభను చూపించే అవకాశం వచ్చింది. ఆ పాట విడుదల కోసం ఎదురుచూస్తున్నా.

ఆయనెంతో పాజిటివ్‌..

బాలకృష్ణ తెల్లవారు జామున 3 గంటలకే నిద్రలేచి 6 గంటల సమయానికి సెట్‌లో ఉంటారు. ఆయన ఎనర్జీ చూసి షాకయ్యేదాన్ని. ఓ సందర్భంలో ‘మీరు మనిషేనా?’ అని ఆయన్ను సరదాగా అడిగా. ఆయన శక్తిని చూసే బహుశా బోయపాటి శ్రీను అఖండ పాత్రని సృష్టించారేమో! ఈ సినిమాకి ఎంపిక కాకముందే వివిధ సందర్భాల్లో బాలకృష్ణగారిని కలిశా. కానీ, ఆయనతో నటిస్తున్నాననే విషయం తెలియగానే కాస్త భయపడ్డా. అంత సీనియర్‌ యాక్టర్‌ పక్కన నటించడమంటే సవాలే కదా!! సెట్‌లో అడుగుపెట్టిన రోజే ఆయన నా టెన్షన్‌ పోగొట్టారు. బాలకృష్ణ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. క్రమశిక్షణ, సమయపాలన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌. అలాంటి నటుడితో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది.

వారిద్దరూ దూరమే..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. ఇద్దరూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే నేనే ఎక్కువగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా. ఇదే విషయాన్ని తమన్‌తో పంచుకున్నా. అలా ఇద్దరం కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. షూటింగ్‌ ప్రారంభంలో జగపతి బాబు సర్‌ని చూసి గుర్తు పట్టలేకపోయా. అలాంటి గెటప్‌లో కనిపించారాయన. తనే నన్ను పిలిచి మాట్లాడారు. జగపతిబాబునే కాదు ప్రతి ఒక్కరినీ బోయపాటి మార్చేశారు.

Read latest Cinema News and Telugu NewsRead latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని