Puneet Rajkumar: పునీత్‌కి అసలైన నివాళి అదే.. మరోసారి ఉదారత చాటుకున్న ప్రణీత

ప్రజలకు సేవా చేసేందుకు ముందుండే నటుల్లో ప్రణీత ఒకరు. ఆ సంకల్పంతోనే ‘ప్రణీత ఫౌండేషన్‌’ని ప్రారంభించారు.

Published : 02 Nov 2021 02:03 IST

బెంగళూరు: ప్రజలకు సేవా చేసేందుకు ముందుండే నటుల్లో ప్రణీత ఒకరు. ఆ సంకల్పంతోనే ‘ప్రణీత ఫౌండేషన్‌’ని ప్రారంభించారు. కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌వేవ్‌ సమయంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన ప్రణీత.. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ గుర్తుగా ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పునీత్‌ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, ఆ బాటలో నడవటమే ఆయనకు మనమిచ్చే ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. ‘అప్పూ సర్‌.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులను భరించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని పేర్కొన్నారు.

బెంగళూరు నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఈ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నవంబర్‌ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో అక్టోబరు 29న మరణించారు. ఆయన అకాల మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. ప్రణీత ఓ అడుగు ముందుకేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని