
Stand Up Rahul: పదా.. పదమంటోంది పసి ప్రాయం
రాజ్‌తరుణ్ హీరోగా శాంటో మోహన వీరంకి తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నటి రష్మిక ఈ చిత్రంలోని ‘‘పదా.. పదమంటోంది పసి ప్రాయం’’ అనే గీతాన్ని విడుదల చేసింది. ఈ మెలోడీ పాటకు స్వీకర్ అగస్తి స్వరాలు సమకూర్చగా.. రెహమాన్ సాహిత్యమందించారు. యాజిన్ నాజర్ ఆలపించారు. పాటలో రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మల జోడీ క్యూట్‌గా కనిపించింది. ‘‘జీవితంలో ఏ విషయానికి కూడా నించోడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారతాడు. ఆ యువకుడికి నిజమైన ప్రేమ ఎదురైనప్పుడు ఏం జరిగింది? తన తల్లిదండ్రులు, ప్రేమ, స్టాండప్ కామెడీ కోసం ఎలా కష్టపడాల్సి వచ్చింది? అన్నదే ఈ కథాంశం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కూర్పు: జి.రవితేజ, ఛాయాగ్రహణం: శ్రీరాజ్ రవీంద్రన్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.