సదా డ్యాన్స్‌ మెరుపులు.. ‘జబర్దస్త్‌’ అంత్యాక్షరి నవ్వులు

‘రాను రానంటూనే చిన్నదో’ అంటూ వెండితెరపై సందడి చేసిన నాయిక సదా. మళ్లీ అదే ఉత్సాహంతో బుల్లితెరపై స్టెప్పులేసి వావ్‌ అనిపించింది. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, తన ప్రతిభని ప్రదర్శించింది.

Published : 26 Jul 2021 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రాను రానంటూనే చిన్నదో’ అంటూ వెండితెరపై సందడి చేసిన నాయిక సదా. మళ్లీ అదే ఉత్సాహంతో బుల్లితెరపై స్టెప్పులేసి వావ్‌ అనిపించింది. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి, తన ప్రతిభని ప్రదర్శించింది. తాను నటించిన ‘జయం’ సినిమాలోని ‘రాను రానుంటేనే చిన్నదో’, ‘నాగ’ చిత్రంలోని ‘మేఘం కరిగెను’ పాటలకు డ్యాన్సు చేసి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఆమె హావభావాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సదా పర్ఫామెన్స్‌ అనంతరం సుధీర్‌, ఆది, రామ్‌ ప్రసాద్‌ ఓ పాటకి డ్యాన్సు చేసి కామెడీ పండించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సదా గ్రేస్‌లో అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేదని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

‘జబర్దస్త్‌’- ‘ఢీ’.. అంత్యాక్షరి

ఇదే కార్యక్రమంలో నవ్వుల వర్షం కురిసింది. సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో ‘జబర్దస్త్‌’, ‘ఢీ’ టీంల మధ్య అంత్యాక్షరి నిర్వహించారు. ఇది చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే! అంతలా అక్షరాల్ని మాయచేసి తమకి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడారు ఆది, రామ్‌ ప్రసాద్‌, ఇమ్మాన్యుయేల్‌ తదితరులు. ‘బండిరా’, ‘రండిరా’ పదాలతో వీళ్లు చేసిన పాటల ప్రయోగాలు నవ్వులు పూయించాయి. ఇది చూశాక ఇలా కూడా పాటలు పాడొచ్చా అనే సందేహకం కలగక మానదు. ఈ నేపథ్యంలో సదా పాడిన పాటకి సుధీర్‌ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ‘లాలీ లాలీ’ గీతంతో ఇంద్రజ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నారు. హోరా హోరీగా సాగిన ఈ పాటల పోటీని మీరూ చూసేయండి.. మనసారా నవ్వుకోండి..



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని