Adbhutham: ఒకే ఫోన్‌ నంబరు ఇద్దరు వినియోగిస్తే.. ట్రైలర్‌ ‘అద్భుతం’

తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందించిన ఈ సినిమా నేరుగా డిజిటల్‌మాధ్యమంలో విడుదలవుతుంది.

Published : 09 Nov 2021 22:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా డిజిటల్‌ మాధ్యమంలో విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నటుడు రామ్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి.. ఒకే ఫోన్‌ నంబరు ఉంటే ఏమవుతుందనే విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. కామెడీ, సస్పెన్స్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మరి తేజ, శివానీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? ఒకే ఫోన్‌ నంబరును ఎలా వినియోగించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ చిత్రానికి రథన్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని