KGF2: స్టైలిష్‌ లుక్‌లో అధీరా అదరగొట్టేశాడు..!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్‌-2’ ఒక్కటి. ప్రశాంత్‌నీల్‌-కన్నడ నటుడు యశ్‌ కాంబోలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా....

Published : 29 Jul 2021 12:05 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్‌-2’ ఒకటి. ప్రశాంత్‌నీల్‌-కన్నడ నటుడు యశ్‌ కాంబోలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా సిద్ధమైన ‘కేజీఎఫ్‌-2’లో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా ‘అధీరా’ పాత్రలో కనిపించనున్నారు. కాగా, గురువారం ‘కేజీఎఫ్‌-2’ నుంచి ఓ సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది. సంజయ్‌ దత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అధీరా’ సరికొత్త పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో సంజయ్‌దత్‌.. కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. మరోవైపు ‘అధీరా’ పోస్టర్‌ షేర్‌ చేసిన సంజయ్‌.. ‘మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ‘కేజీఎఫ్‌-2’లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ ఈ సినిమా విడుదల కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ ఎదురుచూపులకు సరైన ఫలితం ఉంటుందని నేను మాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు