Adi: ఆది.. ‘సి.ఎస్‌.ఐ సనాతన్‌’

ఆది సాయికుమార్‌, మిషా నారంగ్‌ జంటగా శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మాత. నందిని రాయ్‌, అలీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘సి.ఎస్‌.ఐ.

Updated : 18 Dec 2021 08:50 IST

ది సాయికుమార్‌, మిషా నారంగ్‌ జంటగా శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మాత. నందిని రాయ్‌, అలీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను శుక్రవారం దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సెప్ట్‌.. టైటిల్‌ బాగున్నాయి. ఆది సాయికుమార్‌ కొత్తగా కనిపించారు. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్స్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా సినిమాని రూపొందిస్తున్నాం. ఇందులో ఆది క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. రెండో షెడ్యూల్‌ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకి సంగీతం: అనీష్‌ సోలోమాన్‌, ఛాయాగ్రహణం: జి.శేఖర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని